Collection of Words.

November 25, 2008

త్రి మూర్తులు: ప్రేమ “ముందు”

Filed under: Uncategorized — rohitbharadwajg @ 11:08 pm

Disclaimer:

నేను ఇక్కడ రాయబోయె ప్రతి విషయం నిజ జీవితం లొ జరిగిన సంఘటనల పై కొంచం స్వాతంత్రం తీసుకొని రాసినవి. ఇందులో కొన్ని కల్పితమైన కథలు కూడా కలవు. దీన్ని మీరు గమనించాలని నా ప్రార్దన.

ఇది 12 సంవత్సరముల కిందటి మాట ……

మన రాష్ట్ర రాజధాని లో ఒక మూల, పెద్ద పేరున్న ఒక చిన్న స్కూలు లో D.Sc రాసి రాసి ఇక రాదని డిసైడ్ అయిన ఒక పంతులు, పిల్లలకు english dictation చెప్తున్నాడు. అలానే పిల్లలకు కొన్ని మంచి మాటలు కూడా చెప్పాడు. తరువాత మార్కులు వేయడం కోసం పిల్లలు రాసిన జవాబులు చదవడం ప్రారంభించాడు.

అందులో ఒకడు “love all, serve all” కి బదులు “love girls, serve all” అని రాసాడు. దాన్ని చూసి సినిమాలు చిన్న పిల్లల్ని చెడుపుతున్నాయని భాధపడి, ఆ పిల్లాడ్ని తిట్టాడు.

12/2 = 5 సంవత్సరముల కిందటి మాట…..

మళ్లీ అదే నగరం, కాకపోతె ఈ సారి ఊరి మద్యలో ఉన్న ఒక కాలనీ లో, నలుగురు కుర్రాళ్లు (1,2,3,4) IITని ఎలా CRACK చెయ్యాలా అని ఒక పఠం గీస్తున్నరు. ఆ గీసేది “3” రెంట్ కి ఉంటున్న ఇంట్లొ కూర్చొని. సమయం 6-7 మధ్య ఉన్న 6:30 అయింది. కాని 6:45 కి 3 తన ఇంటికి ఎదురుగా ఒక కత్తి, చాకు, మేకు లాంటి పాప ఉంది కాని ఎప్పుడూ బయటకు రాదని చెప్పగానే పఠాలు గీసి గీసి అలిసిపోయిన మన యూత్ లో ఎక్కడా లేని హుషారు, ఉత్సాహం, ఉల్లాసం మొదలైనవి వచ్చాయి. ముందు ఎవరు వెళ్లీ చూడాలా అని గొడవ పడకుండా ఒక్కక్కరిగా వెళ్లీ చూద్దామని సంధి చేసుకున్నారు.

ముందు 1 వెళ్లి ఏడుపు ని తనతో పాటు తీసుకొని వచ్చాడు. 2 వెళ్లి మళ్లి ఏడుపు ని తెచ్చుకున్నాడు. కాని అదెంటో 2 రాగానే 1 మొఖం లో ఒక రాక్షస నవ్వు వచ్చింది. ఇంక మిగిలింది రెంట్ కట్టే 3 మరియు 4. 3 వెల్లినంతా వేగంగా వెనుకకు వస్తూ ” తూ నా బ్రతుకు, అటు మార్కులు రాక, ఇటు ఇదీ కనపడక అస్సలు జీవితం మీదె వ్యరక్తి వస్తొంది” అని అనుకుంటూ వెనక్కి వచ్చాడు. తరువాత 4 వెళ్లాడు. ………………………….

….

ఇలా ఎంతసేపటికీ రాకపోవడం గమనించిన వారు అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లారు. వారిని చూడగానే 4 పైకి చూస్తూ హైదరాబాదు లో ఎప్పుడూ కనపడని చుక్కలని లెక్క పెట్టాడు. ఎదురింటి బెడ్ రూం లైట్ ఆగిపోయింది.

5+4= 2 సంవత్సరముల ముందు మాట ……..

Interaction చేయించుకున్న వయసు నుండి అది చేసే వయసుకు రాగానే, నిక్కర్ల నుండి ప్యాంట్లలోకి వచ్చినంత ఆనందం, పెద్ద వాళ్లమైపోయాం అన్న గర్వం తో కూడిన హుందాతనం కలగలిపి అక్షరాల 4 అడ్డ రోడ్లున్న మన క్యాంపస్ అంతా మనదె అని అనుకొని తిరుగుతున్న రోజులు.

చదువుకునే అలవాటు పొరపాటున కూడా లేని నేను మరియు నా దొస్తులు ( ఒక్కడికి మాత్రం ఆ అలవాటు ఉంది 😛 ) మన పానీయ కేంద్రం అదే నండి మన ఐదో మెస్ “Coffee Shop” దెగ్గర కూర్చొని ఇండియా – పాకిస్తాన్ ఎందుకు విడిపోయాయా అని తెగ ఫీల్   ఐపోతూ శీతల పానీయాలు తాగుతున్నం . ఇంతలో

1 – ” అరే ! ఇంక వెళ్దామా రూం కి ? ”

2- ” అప్పుడే పోయి చెసేంత పీకె పనులు యెమున్నయి రా… ”

1 – ” లేదు రా వెళ్లాలి తప్పదు… ”

2 – ” ఎహె ఎందుకో చెప్పు … ”

3 – ” అరేయ్ వెళ్దాం లేరా, నేను కూడా నడుస్తూ చదువుకోవాలి. ”

2 – ” తూ, ఎక్కడ దొరికారు రా.. సరె పోదాం పదండి.”

అని అప్పటి GH ఇప్పటి పారిజాత్ నివాస్ మీదుగా అడ్ద దోవలో రూం కి చేరుకున్నాము. రాగానే “1” తన రూమంతా తొందరగా, చిందర వందరగా వెతక సాగాడు. CS కి వెళ్లె ముందు “2” రూం కి వెళ్లిన సంగతి గుర్తోచ్చి “2” రూం ని కూడా వెతకడం తో “2” కి సందేహం వచ్చి

2 – ” ఏమైందిరా, రూం కి పట్టుకొచ్చావ్ హడావిడి గా, అంతా వెతికేస్తున్నావ్ విచిత్రంగా, ఎం పొయింది ? ”

1 – ” ఏం లేదు లెరా ”

2 – ” నాటకాలు దొబ్బకు, ఎం పోయిందో సక్కగా చెప్పు. ”

1 – ” ఏం లేదు రా, phone వచ్చేలా ఉంది. ”

2 – ” $@#&”

2 – ” వర్షం వచ్చేలా ఉంది అని విన్నా కాని, ఈ phone వచ్చేలా ఉండడం ఎంట్రా… ” , అని అక్కడ ఉన్న అందరి వైపూ బిక్క మొహం పై ఒక తిక్క expression పెట్టి అడిగాడు.

ఇంతలో రానే వచ్చింది PHONE. ఎలా ? ఎలా ? ఎలా తెలిసింది వాడికి ముందె, అని తనకు వచ్చిన ధర్మ సందేహాన్ని తీర్చుకోవడం కోసం 1 phone పెట్టేయగానే అడుగుదాం అని 6:30 నుండీ అలా నిరీక్షించి నిరీక్షించి నీరసించిన తరువాత 8:30 కి phone పెట్టేయడం జరిగింది.

2 – ” ఎలా తెలిసింది రా ముందుగానె నీకు ”

1 – ” ఏంటి తెలియడం.. ” ( ఏమీ తెలియనట్టు ఒక ఎదవ expression మోము పై మోస్తూ )

2 – ” అదే phone వస్తోందన్న విషయం ”

1 – ” తెలుస్తుంది కదరా ”

2 – ” @#&% ”

2 – ” అదే ఎలా ”

1 – ” lite తీసుకో ”

2 – ” ప్లీజ్ చెప్పరా … ”

1 – ” lite తీసుకో అన్నాను గా ”

ఆ పన్నెండు, 5 మరియు రెండు సంవత్సరముల కిందట జరిగిన సంఘటనలలో ఒకే ఒక్కడు common. వాడు ఎవరు ? ఏం చేస్తున్నాడు ? పుట్టుకతోనే ఏవైనా అతీంద్రియ శక్తులు పునికి పుచ్చుకున్నాడా ? మెదలగు వివరాలు తెలుసుకునే ముందు అందరూ ఒక్క సారి ” ప్రేమాయనమహా ” అని మీ పక్క రూం లోకి వినపడేలా గట్టి గా అనండి.

మిగతా ది వచ్చే టపా లో ……

PS: దీంట్లొ కోంచం కల్పితం కూడా కలదు.

PS1: ఈ మహానుభావుల గురించి రాయడం ప్రారంభించిన తరువత వేరే ఏ పనీ చేయ్యబుద్ది  కావడం లేదు.

PS2: ఇంకేంటండి సంగతులు 😛

PS3: ఈ టపా కు ప్రేమా అనె title apt అని నా ఉద్దేశం, మరి మీరేమంటారు. ?

PS4: అందరూ end-sems కి బాగా ప్రిపేర్ అవ్వకండి

4 Comments »

  1. mi tapa bagundi so inthe rastu vundandi koruthu mi arun

    Comment by arun — November 25, 2008 @ 11:45 pm | Reply

  2. ఈ టపాకి comment రాసే అదృష్టం కలిగినందుకు మహదానందం కలుగుతున్నది :). నువ్వు రాసినవాటిల్లో ఎమన్నా కల్పితాలు వున్నయెమోగనీ ఈ మన్మధుడితో నాకు కలిగిన ఎధార్ద గాద చెప్పదలుచుకున్న.
    అది 2 సంవత్సరముల ముందు మాట… మొదటి సారి మన్మధ రాసా అని పాట పాడుకుంటూ కలియుగ మన్మధుడి పక్కన కుర్చుని సినిమా చూస్తున్న. అకస్మాతుగా ఒక phone call వచ్చింది. ఎవరో ఒక స్త్రీ గొంతు. ఎవరో తెలియదు. పక్కనే వున్న మన మన్మధుడి నేను handle చెస్తా అని phone తీసుకున్నాడు.నాకు వచ్చిన call వీడు ఎలా handle చేస్తాడా అని పెద్ద question bank మొహం మీద పెట్టుకుని చూస్తున్న. సినిమా నడుస్తూనే వుంది అక్కడ. wrong call ఎమో సినిమా అయ్యాక చూద్దాంలే lite తీసుకో అని చెప్పినా వినకుండా మన వాడు మొదలు పెట్టాడు. అక్కడ తెర మీద మన హీరో మాంచి powerfull dialogues వేస్తున్నాడు. అందరు చప్పట్లు ఈలలు వేస్తూ అవి రాని వాళ్ళు అరుపులు అరుస్తూ వున్నారు. కనీ మనవాడు phonelo మాట్లాడుతూనే వున్నాడు. అలా ఒక 10-15 mins గడిచాయి. ఇంక లాభం లేదని phone లాకుని cut చెసేసా. ఇంతకీ చేసింది ఎవరంటారా??? ఎవరో ఒక స్త్రీ. తిరుపతి నుంచి అంట. frensతొ కలిసి సరదాగా random numbers one-rupee coin phone నుంచి చేసింది. (ఇదీ coin phone sounds బట్టి పక్కన వున్న frensతో మట్లాడే మాటలు బట్టి మన వాడు కనిపెట్టాడు). 10 mins ఎం మాట్లాడావురా అంటే ఎమి లేదు అన్నాడు. ఒక dialogue మాత్రం చెప్పాడు. ఎవరు కావలి అంటే నువ్వే కావాలి అంది అంట :). పిచ్చి వాడా… ఎవరో తెలియని wrong callతో అందులోనూ హిట్ సినిమా theatreలో చూస్తూ చుట్టూ అరుపుల మద్య cell నేను లాక్కోటం వల్ల 10-15 mins మాట్లాడిన వాడు, hostelలో ప్రశాంత వాతావరణంలో 2 hrs నన్ను అడిగితే చాలా తక్కువే. ఇంతకన్నా ఎక్కువ చెప్పకర్లేడు అనుకుంట 😀
    Looking forward for few more parts on the same guy 🙂

    Comment by Ambati — November 25, 2008 @ 11:55 pm | Reply

  3. అమ్మనీ! సుంకూ డార్లింగ్ ఇంత పని చేసిందా! ఆ ఎదురింటి పాప గురించి ఎప్పుడూ చెప్పనన్నా చెప్పలేదు 😛 ఆ రూం కూడా తెలిసే తీస్కుని ఉంటాడేమోనని నా అనుమానం………….

    Comment by Gopal — November 26, 2008 @ 12:09 am | Reply

  4. >> 2 – ” ఎలా తెలిసింది రా ముందుగానె నీకు “
    >> 1 – ” ఏంటి తెలియడం.. ” ( ఏమీ తెలియనట్టు ఒక ఎదవ expression మోము పై మోస్తూ )

    sunku gaadu inthe mahaaa M gaadu. emi teliyanattu ekasekaalu D thaadu. vaadu 3IT lo nadipina a aa e ee la gurinchi in detail gaa raayaalani maa “West Gopavaram” manavi.

    Comment by redrod — November 26, 2008 @ 9:47 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Create a free website or blog at WordPress.com.